Listen to this article

జనం న్యూస్ ఆగస్టు(23)

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల కేంద్రంలో అనాధలైన ఆడపిల్లలు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు వివరాలలోకి వెళితే నూతనకల్ మండల కేంద్రానికి చెందిన గుండాల సరిత గత ఆరు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది ఆ తర్వాత తండ్రి లింగయ్య కూలి నాలి పనులు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లల్ని చదివించుకుంటూ కన్నతల్లిని పోషించుకునేవాడు దురదృష్టవశాత్తు గత రెండు సంవత్సరాల క్రితం తండ్రి లింగయ్య మరణించడంతో పిల్లలు అనాధలు అయ్యారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఆడపిల్లలు లిఖిత(14)నికిత(15) నూతనకల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తున్నారు సెలవు రోజుల్లో కూలి నాయిల్ పనులు చేసుకుంటూ వృద్ధురాలు అయినా తమ నానమ్మ అవిలమ్మను పోషించుకుంటున్నారు కనీసం ఉండడానికి ఇల్లు లేదు ఇంట్లో నిత్యవసర సరుకులు లేవు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.నా అనేవారు ఎవరు లేకపోవడంలో దిక్కుతోచని పరిస్థితిలో పిల్లలు తమని దయ హృదయంతో ఎవరైనా ఆదుకోవాలని కోరుకుంటున్నారు.