జనం న్యూస్ ఆగస్టు 23 చిలిపిచేడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని చండూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సప్త భజన కార్యక్రమం భజన భక్తుల మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రావణమాసం ముగింపు సందర్భంగా శనివారం ఉదయం సప్త భజన కార్యక్రమాన్ని చేపట్టి ఆదివారం ఉదయం ఏడు గంటలకు సప్త భజన ముగింపు కార్యక్రమాన్ని భజన నిర్వహిస్తారు ఉదయం సప్త భజన కార్యక్రమం మొదలై ఆదివారం ఉదయం ముగుస్తుంది సప్త భజన కార్యక్రమాన్ని భజన మండలి సభ్యులు ఎంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారుమండల సభ్యులు చండూరు గ్రామంలోని హనుమాన్ భజన మండలి సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేస్తామని శ్రీరామలింగేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ సాయి రెడ్డి గారి వెంకటరెడ్డి అన్నారు శనివారం నాడు శ్రావణమాస ముగింపు సందర్భంగా హనుమాన్ మందిరంలో జరిగిన పూజ భజన ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు చండూరు గ్రామం భక్తి శ్రద్ధలతో మరింత ముందుకెళ్లాలని గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవస్థానం హనుమాన్ దేవస్థానం లలో రెండు భజన మండలిని ఏర్పాటు చేయడం జరిగింది గతం లోనే శ్రీ రామలింగేశ్వర స్వామి భజన మండలి కి గుర్తింపు కార్డులో అందజేశాము ఈసారి హనుమాన్ మందిరంలో సభ్యులకు గుర్తింపు కార్డులను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు రెండు దేవాలయాలలో శ్రావణమాసం మొదటి రోజు నుండి నేటి వరకు ప్రతిరోజు భజన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో కూడా సప్త భజన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు ఈ రెండు దేవాలయాల్లో నెలరోజులపాటు భజన కార్యక్రమాలు జరిగాయి చివరి రోజు ప్రసాద పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం భజన మండలి హనుమాన్ భజన మండలి తోపాటు గురు భక్తులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు భక్తులుఅధిక సంఖ్యలో పాల్గొన్నారు


