జనం న్యూస్ ఆగస్టు 23 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది
సి పి ఎస్ వి విధానాన్ని రద్దుచేసి పాత పింఛను పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఇట్టి సమస్యను తమరి ద్వారా ప్రభుత్వదృష్టికి తీసుకెళ్ళాలని చిలిపిచేడు మండల తహసీల్దారు గారికి “తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం” చిలిపిచేడ్ మండలశాఖ వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ ,మహేష్ కుమార్ ,ప్రభాకర్ ,శంకర్ సింగ్ ,యాద గౌడ్ ,మల్లేశం ,రంజిత్ కుమార్ ,వినోద్ మరియు తపస్ సంఘ బాధ్యులు పాల్గొన్నారు


