జనం న్యూస్ 23 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి )
బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త గొల్లరాజు, గొల్ల సహస్ర కొద్దిరోజుల క్రితం బైక్ మీద నుంచి పడి గాయపడటంతో చికిత్స కోసం ఆర్థిక పరిస్థితి బాలేక ఇబ్బందులు పడుతూ ఉన్న విషయం స్థానిక బిజెపి కార్యకర్తల ద్వారా తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్నారై కోనేరు శశాంక్ రుద్రూర్ మండలం అంబం గ్రామ కార్యకర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పి నేనున్నాను భరోసానిచ్చి 5,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని రుద్రూర్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు రేపల్లె సాయి ప్రసాద్, కోశాధికారి కటిక రామ్ రాజు, మండల సెక్రటరీ శానం బాలాజీ మండల సీనియర్ నాయకులు బూత్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


