జనం న్యూస్ 23 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల సమస్యలపై బిజెపి నాయకులు గళం విప్పారు. శనివారం నాడు రుద్రూర్ తాహసిల్దార్ తారాబాయికి పలు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు కటికే రామరాజు మాట్లాడుతూ రుద్రూర్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు తావివ్వకుండా పారదర్శకంగా గ్రామంలో ప్రజా వేదికను ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో వర్షాలు పడగానే రుద్రూర్ పెద్ద చెరువు అలుగు ప్రవాహంతో బొప్పాపూర్ రుద్రూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడం పరిస్థితిలు ప్రమాదకరంగా మారుతున్నాయని క్లిష్టమైన పరిస్థితిని జిల్లా కలెక్టర్లు దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కార మార్గాలు చూడాలని అన్నారు. రుద్రూర్ గ్రామంలో పురాతన కాలం నుండి ఉన్న కందకాలు కబ్జాకు గురి కావడం జరిగిందని తద్వారా వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ఇండ్లు మునిగి తీవ్ర ఆస్తి నష్టం జరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని కబ్జాకు గురైన కందకాలను గుర్తించి వెంటనే పరిష్కార మార్గాలు చూడాలని ఉన్నారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని ప్రజలు చిన్న పిల్లలు రోడ్లపై తిరగడానికి భయాందోళనకు గురవుతున్నారని కుక్కల బెడద నివారించాలని రుద్రూర్ తాహసిల్దార్ తారాబాయికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్స్ సున్నం సాయిలు, ప్రశాంత్ గౌడ్, బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్నారై కోనేరు శశాంక్, సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, మండల కోశాధికారి కటిక రామ్ రాజ్,పార్వతి మురళి తదితరులు పాల్గొనడం జరిగింది.


