Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 23:

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం: తొర్తి గ్రామంలో అయిల్ పామ్ రైతుల సమావేశంలో బాల్కొండ డివిజనల్ ఉద్యనాధికారిరుద్ర వినాయక్ మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న నేషనల్ మిషన్ అన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ పథకం లో భాగంగా ఇచ్చే సబ్సిడీలు ఈ సంవత్సరం ఆఖరి అని తెలిపారు. తర్వాత రైతులకు పథకం యొక్క సబ్సిడీలను మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ తో కలిసి వివరించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డ్రిప్, మరియు మొక్కల సబ్సిడీలను ఉపయోగించుకొని రైతులందరూ ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని ఉద్యాన మరియు వ్యవసాయ అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ మనీషా, ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు ప్రేమ్ సింగ్ రైతులు పాల్గొన్నారు.