Listen to this article

జనం న్యూస్ నడిగూడెం ఆగష్టు 23

మండలం పరీదిలోని రత్నవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూవ నాయకుడు మొలుగూరి నరసింహారావు విద్యుత్ షాక్ తో మృతి చెందడం బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు శనివారం విద్యుత్ షాక్ తో మృతి చెందిన నరసింహారావు భౌతిక దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు.గ్రామాల్లో అందరితో కలివిడిగా ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం గ్రామాల్లో ఉన్న సమస్యలపై నిరంతరం పోరాడేవారని పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారని వారి లేని లోటు గ్రామానికి పార్టీకి తీరని లోటని,మంచి వ్యక్తిని కోల్పోయామని ఆయన సేవలను కొనియాడారు.కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, ఉపాధ్యక్షులు దున్న శ్రీను, గ్రామ మాజీ సర్పంచ్ లు పగడాల పద్మ ప్రభాకర్ రెడ్డి,రామిని విజయ్ వర్ధన్ రెడ్డి,వినయ వర్ధన్, గ్రామ శాఖ అధ్యక్షుడు సోమగాని రవి తదితరులు పాల్గొన్నారు.