జనం న్యూస్ 24 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన జంషెడ్ పూర్ స్టేట్ నేషనల్ సీనియర్స్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్షిప్ – 2025 పోటీలలో విజయనగరానికి చెందిన శీల రామకృష్ణ అనే యువకుడు పాల్గొని జిల్లా గర్వించే విధంగా సంచలన ప్రదర్శన చేసాడు. విజయనగరం జిల్లా పరిషత్ లో కంప్యూటర్ ఆపరటర్ గా పని చేస్తున్న రామకృష్ణ ఈ నెల 18 నుంచి 21 వరకు ఝార్ఖండ్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని 550 కేజీలు బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించాడు. విజయనగరానికి చెందిన వ్యక్తి జాతీయ స్థాయి పోటీలలో గోల్డ్ మెడల్ సాధించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించడానికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను), జడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ లు రామకృష్ణను అభినందించారు.


