Listen to this article

జనంన్యూస్ 24. నిజామాబాదు.

అక్రమ వడ్డీ మరియు అధిక వడ్డీ వ్యాపారుల పై పోలీసుల మెరుపు దాడులు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో విస్తృత స్థాయిలో దాడులు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ వడ్డీ వ్యాపారులపై శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, రిజిస్ట్రేషన్ సైతం లేకుండా అనేకమంది అక్రమంగా ఫైనాన్స్ లు ఏర్పడి, ఇలా అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని ఫిర్యాదుల మేరకు ఈ దాడులు జరిపారు. సామన్య పేద కుటుంబాలకు చెందిన వారి అవసరాలను ఆసరాగా చేసుకొని , ఫైనాన్స్ పేరుతో వారి వద్ద నుండి అధిక వడ్డీలు పసూలు చేస్తూ వీరిని ఆర్ధికంగా మరింత ఇబ్బందులకు గురి చేస్తున, ఈ అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా లభ్యమైన పూర్తి వివరాలు ఈ దిగువ విధంగా గలవు 1) చెక్కులు నిజామాబాదులో = 137, వాటి విలువ 10,14,11,370/- ఆర్మూర్ లో =62, వాటి విలువ 30,36,000/- బోధనలో = 00 2).ప్రామిసరీ నోట్స్ నిజామాబాదులో= 170, వాటి విలువ=7,10,73,870/- ఆర్మూర్ లో =324, వాటి విలువ 4,97,10,000/- బోధన్ లో= 00 3).బాండ్ పేపర్స్ నిజామాబాదులో = 00
ఆర్మూర్ లో =49, వాటి విలువ=1,85,30,500 /- బోధన్ లో = 00 4).ల్యాండ్ డాక్యుమెంట్స్ నిజామాబాదులో=99
ఆర్మూర్ లో=05 బోధన్ లో = 00 5) *నిజామాబాదులో నగదు మొత్తం రూపాయలు= 1,21,92,750.