Listen to this article

పాఠశాల విద్యార్థులకు ప్రమాదం దృష్ట్యా రోడుకు అనుకొని ఉన్న మొదటి గేటుకు తాళం.

జిపఉప పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం అంజన,సిపిఎస్ హెచ్ఎం వెంకటేష్,

జనం న్యూస్,ఆగస్ట్ 25,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పాఠశాలకు రెండు గెట్లు ఉండగా మొదటి గేటు కంగ్టి పిట్లం రోడ్డుకు ఉండగా, రెండో గేటు తడ్కల్ గ్రామంలో వెళ్లే రోడ్డుకు ఉంది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, ఆటస్థలంతో పాటు మరి ముఖ్యంగా విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేనందున విద్యార్థులు ఇంటర్వెల్ సమయంలో మూత్రవిసర్జనకై కంగ్టి పిట్లం రోడు దాటి వెళ్ళవలసి వస్తుంది.కంగ్టి పిట్లం రోడు ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండడంతో, వాహనాల వేగం ఎక్కువగా ఉండడంతో పాఠశాల విద్యార్థులకు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం వెంబడిస్తుందని అన్నారు.పాఠశాలలో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థికి ప్రమాదం జరగకూడదన్న సదుద్దేశంతో మొదటి గేటును మూసివేసి రెండొ గేటు ద్వారా విద్యార్థినీ విద్యార్థుల సంరక్షకులు,విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్తులు,రెండొ గేటు నుంచి రాకపోకలను గావించాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తడ్కల్ పాఠశాలకు సరిపడా తరగతి గదులు, మూత్రశాలలను నిర్మింపజేయాలని అన్నారు.పాఠశాల ఆవరణంలో ఆ సాంఘిక కార్యకలాపాలను జరుపుతున్నారని అన్నారు. ఇట్టి ఆసాంఘిక కార్యకలాపాలను జరగకుండా గ్రామ పెద్దలు,యువజన సంఘ నాయకులు, ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు భోజనం చేసే ఆవరణంలో గుట్కాలు తిని ఉమ్మి వేయడంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు.ఇకముందు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తుండగా దొరికిన వారిని పోలీస్ శాఖ వారికి అప్పగించి కఠినంగా చించబడతారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.