

తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్,
జనం న్యూస్,జనవరి 28,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ క్లస్టర్ ఎంఆర్పిఎస్ సంఘం మంగళవారం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుని చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్,మాట్లాడుతూ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై మాదిగ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.గత ముపై సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో తడ్కల్ క్లస్టర్ సహాయ కార్యదర్శి చిలుక గంగారం,తడ్కల్ గ్రామ అధ్యక్షులు ఎర్రోళ్ల రాజు,ఘణపూర్ గ్రామ ఉపాధ్యక్షులు అనోక్, ప్రధాన కార్యదర్శి మేత్రి సాయిలు,ముర్కుంజాల్ గ్రామ ప్రధాన కార్యదర్శి మేత్రి రాజు,చాప్ట (బి) గ్రామ ఉపాధ్యక్షులు మోజేష్,దామర్ గిద్ద ప్రధాన కార్యదర్శి యోహాన్,పర్వయ్య,యాదయ్య, రమేష్,మనోహర్,రాజు,పవన్,అశోక్,శ్రీకాంత్, మాదిగ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.