Listen to this article

జనంన్యూస్. 25.సిరికొండ.

రావుట్ల రైతులకు సిరికొండ వ్యవసాయ అధికారి మరియు IFFCO కంపెనీ అవగాహన సదస్సు కల్పించారు.
రసాయన ఎరువులకు ధీటుగా నానో యూరియా తో ప్రయోజనాలు. నానో తో పర్యవరణ పరిరక్షణ పోషక విలువల సామర్ధ్యం ఎక్కువ నేలకు, పంట కు మేలు. రైతుల్లో చైతన్యం రావాలి రైతులు నానో యూరియా వైపు మొగ్గు చూపాలి నానో యూరియా తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు క్షేత్ర స్థాయిలో సదస్సు నిర్వహించారు. నానో యూరియా వాడకం వల్ల దిగుబడిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని అత్యంత ప్రయోజన కరిణిగా ఉన్న నానో యూరియాని రైతులు వాడలీ. నానో యూరియా అనేది నానోటెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన ద్రవ రూపంలో ఉండే ఎరువు… దీనిని వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు నానో యూరియా మొక్కలకు సమర్థవంతంగా నత్రజనిని అందిస్తుందని , పంట దిగుబడిని పెంచడంలో సహాయపడుతుందన్నారు సాంప్రదాయ యూరియా వాడటం వల్ల పర్యవరణ కాలుష్యం,
భూగర్భ జల వనరులకు ఇబ్బంది కలగడమే కాకుండా , నేలకు కూడా చాలా నష్టం కలుగుతుందన్నారు
సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా తక్కువ మొత్తంలో వాడడం వల్ల..ఇది మట్టి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు అధిక దిగుబడి తో పాటు మెరుగైన పోషక విలువలతో కూడిన పంటలను పండించడానికి నానో యూరియా సహాయపడుతుందన్నారు నానో యూరియా ద్రవ రూపంలో ఉండటం వల్ల, రవాణా, నిల్వ చేయడం సులభతరమన్నారు. పంటలకు పోషకాలు అందించడంలో రసాయన ఎరువులకు ధీటుగా నానో ఎరువులు పనిచేస్తయన్నారు సంప్రదాయ యూరియా నత్రజని వాయువుగా మారి వాతావరణంలోకి విడుదలై పర్యావరణానికి హాని చేస్తుందని… రసాయన యూరియా అధిక వాడకం వల్ల పొటాష్‌, పాస్పరస్‌ లభ్యతను తగ్గిస్తుందని… నత్రజనిని వేగంగా విడుదల చేసే సంప్రదాయ యూరియా కంటే.. నానో యూరియాని వాడాలి. సారవంతమైన నేలను కాపాడుకోడానికి నానో ఎరువుల వాడకం మంచిది.
ఈ కార్యక్రమంలో Mao సిరికొండ నర్సయ్య, IFFCO జిల్లా manger సాయిశివరామాకృష్ణ, MDO హరి కృష్ణ, రైతులు పాల్గొన్నారు.