Listen to this article

సానుకూలంగా స్పందించిన మైనంపల్లి రోహిత్

పాపన్న పేట , 24 ఆగస్టు: (జనంన్యూస్)

మండల కేంద్రమైన పాపన్నపేట నుంచి కొంపల్లి వరకు రోడ్డు విస్తరణ మరియు కొత్తపల్లి వంతెన వద్ద పెండింగ్ లో ఉన్న రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ పాపన్నపేట మండల నాయకులు ఆదివారం ఎమ్మెల్యే రోహిత్ రావుకు వినతి పత్రం అందజేశారు. పాపన్నపేట నుంచి కొంపల్లి వరకు పది కిలోమీటర్ల సింగిల్ రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిందని, అనేక మూలమలుపులు ఉండడం వలన మండల కేంద్రానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే స్పందించినట్లు వారు తెలిపారు. దాంతో పాటు కొత్తపల్లి వంతెన వద్ద పెండింగ్ లో ఉన్న రోడ్డు నిర్మాణానికి సైతం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, పార్టీ నాయకులు బాబర్, డీలర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.