Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

ఈనెల 24వ తేదీన రాజంపేట గవర్నమెంట్ హై స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ కి చెందిన 9వ తరగతి విద్యార్థులు ఎం యేసుప్రియ మరియు ఎస్ మన్సూర్ఈ సందర్భంగా పాటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయు రాలు మాధవి లత మాట్లాడుతూ రాజంపేటలో జరిగినటువంటి బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్ సెలక్షన్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి పాటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.అలాగే ఈనెల 29,30,31వ తేదీల్లో ప్రకాశం జిల్లా లోని‌ చేవూరు లో జరగనున్న జిల్లా స్థాయి పోటీల్లో యేసు ప్రియ మరియు మన్సూర్ పాల్గొంటారని తెలపడజరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ సుదర్శన్ రాజు పాఠశాల పీడి సుస్మిత, పి ఈ టి జగన్ మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు మరియు శుభాశీస్సులు తెలియజేశారు.