Listen to this article

బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శెట్లుర్ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ కావడంతో సోమవారం రోజు 28 మంది హాజరు కాగా అందులో నుంచి 21 మంది విద్యార్థిని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వాంతులు కావడంతో హుటాహుటిన బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా 21 మంది విద్యార్థులను తరలించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ఇన్చార్జ్ స్వప్న తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం కిచిడి చారు గుడ్లను విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. పాఠశాల హెచ్ఎం బిచ్కుందలో టిఎల్ఎం పై వెళ్లానని వివరణ తెలిపారు. కాగా విద్యార్థులను అడగగా ఈరోజు మధ్యాహ్న భోజనంలో వండిన కిచిడీలో మిల్ మేకర్ సరిగా ఉడకకపోవడంతో పాటు చారులో ఉప్పు శాతం అధికంగా ఉండడంతో దానికి తోడు వడ్డించిన అన్నంలో పురుగులు ఉండడంతో అది తిన్న తర్వాత విపరీతంగా వాంతులకు గురయ్యామని అన్నారు.ఈ విషయంలో బిచ్కుంద తహసిల్దార్ వేణుగోపాల్ దృష్టికి తీసుక వెళ్లగా ఏవైతే బియ్యం ఉన్నాయా వాటిని రీప్లేస్మెంట్ చేసి ఇస్తామని తెలిపారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం అస్వస్థకు గురైన విద్యార్థులు అందరూ బాగానే ఉన్నట్లు తెలిపారు. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇకపై ఇలాంటి నాసిరకం బియ్యం వండి పిల్లలకు పెట్టరాదని అనుభవం ఉన్న వారితో మాత్రమే వంటలను చేయించి విద్యార్థులకు అందజేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ప్రత్యేక పూర్తి విచారణ జరిపి సంబంధిత అధికారులపై ఏజెన్సీ వారి పై చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, తాసిల్దార్ వేణుగోపాల్, డిప్యూటీ తాసిల్దార్ భారత్, ఆర్ఐ రవీందర్, ఎస్సై మోహన్ రెడ్డి,ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ స్వప్నాలి,స్టాఫ్ నర్స్ నాగమణి, పవన్,ల్యాబ్ టెక్నీషియన్ నరేష్,సూపర్వైజర్ మోహిన్,లు తదితరులు ఉన్నారు.