Listen to this article

సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పలు విషయాలపై తమ అభిప్రాయాలు పంచుకోవడం సాధారణమే. సినీ, క్రీడా, రాజకీయ అంశాలతో పాటు ఇతర విషయాల మీద కూడా స్పందిస్తూ ఉంటారు. నెగెటివ్ పోస్ట్‌లతో సెలెబ్రిటీలు కాంట్రవర్సీల్లో చిక్కుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక్కోసారి పాజిటివ్ పోస్టులతోనూ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఆమె అనవసర వివాదంలో చిక్కుకుంది. విద్యా పెట్టిన ఒక్క పోస్ట్ అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దేను కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇంతకీ ఏంటా పోస్ట్? అందులో స్టార్ హీరోయిన్ ఏం రాసుకొచ్చారు? అనేది ఇప్పుడు చూద్దాం..