Listen to this article

ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ విజయ కుమార్

జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం ఈగల్ బృందం ఆధ్వర్యంలో ఆగస్టు 25న పూల్ బాగ్ లోగల మహారాజ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో పాలిటెక్నికల్ విద్యార్ధులకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాల పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈగల్ హెచ్సీ విజయ కుమార్ మాట్లాడుతూ – మాదక ద్రవ్యాలు భవిష్యత్తుకు అనర్థదాయకమన్నారు. ఒకసారి మత్తు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఆయా అలవాట్ల నుండి బయటపడడం కష్టమని అన్నారు. ఒకసారి మాదక ద్రవ్యాలను వినియోగిస్తే కొద్ది రోజుల్లోనే వాటికి బానిసలుగా మారుతున్నారన్నారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టుకోవాలని, లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. చెడు అలవాట్లతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. ప్రాథమిక స్థాయిలో మాదక ద్రవ్యాల వినియోగించే అలవాటు ఉంటే డీ-అడిక్షన్ సెంటర్స్ లో అందించే చికిత్స ద్వారా స్వస్థత పొందవచ్చునన్నారు. కావున, యువత, విద్యార్ధులు భవిష్యత్తు పై శ్రద్ధ పెట్టాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్ధులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఈగల్ టీమ్ సభ్యులు, పాలిటెక్నికల్ లెక్చరర్స్, విద్యార్ధులు పాల్గొన్నారు.