Listen to this article

జనం న్యూస్ 28 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ కలిసి, వినతిపత్రం అందించారు.ఈసందర్భంగా ఎ.పి.యస్.ఆర్.టి.సి. అవుట్సోర్సింగ్ అసోసియేషన్ స్టేట్ పబ్లిక్ సెక్రెటరీ ఏ అశోక్‌ మాట్లాడుతూ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కార్మికులకు యాజమాన్యం నిర్ణయించిన జీతాలు ప్రకారం కార్మికులకు కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదు.ఇచ్చే వేతనాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. కాంటాక్టర్ ద్వారా సక్రమంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని,ఔట్సోర్సింగ్ కార్మికులకు కాంట్రాక్టర్ పెట్టే జీతాల బిల్లులతో సంబంధం లేకుండా ప్రతినెల 10వ తేదీలోపు జీతాలు ఆయా కాంట్రాక్టరు ద్వారా కార్మికుడి బ్యాంకు ఖాతా నందు జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి. లేబర్ ఆక్ట్ ప్రకారము కార్మికులకు రావలసిన, నేషనల్ ఆఫ్,లు ఫెస్టివల్ లీవ్స్ వర్తింపజేసే విధంగా చర్యలు కోరారు.ఎస్ఐ కార్డులు కూడా ఇవ్వాలని అడిగారు . డి పి టి ఓ సానుకూలంగా స్పందించే సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తిరుపతి, శివ, ఎల్లారావు రఘు తదితరులు పాల్గొన్నారు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.