సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకరరావు
జనం న్యూస్,ఆగస్టు26,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా ముఠా కార్మిక సంఘం జిల్లా మహాసభ అచ్యుతాపురంలో గల ఎస్కేఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర రావు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రకారం ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఠా కార్మికులకు స్థానిక పరిశ్రమలో ఉపాధి కల్పించి, ముఠా కార్మికులకి ఈఎస్ఐ,పీఎఫ్ అమలు చేయాలన్నారు.కార్మిక చట్టాలు సవరణ చేసే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాల పక్కాగా అమలు చేయాలన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలకు నష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తే సహించమని ఆయన హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులకు నష్టం చేసే చర్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కార్మికుల ఐక్యంగా సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించి, ముఠా కార్మికులకి సమగ్ర చట్టం చేయాలని మహాసభ తీర్మానించింది. లాలం నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము,గని శెట్టి సత్యనారాయణ, సీఐటీయూ మండల కన్వీనర్ కే సోమనాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రీ అప్పారావు, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు కే నానాజీ, కర్ణం వెంకట్రావు,కనకాల అప్పలరాజు, సిహెచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


