బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఏఎంసి చైర్ పర్సన్ కవిత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. మద్నూర్ మార్కెట్ కమిటీ నుండి బిచ్కుంద మార్కెట్ కమిటీ విభజింపబడి నూతనంగా ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా 112.07 లక్షల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు గౌరవ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మి కాంతారావు చొరవతో మంజూరు కావడం జరిగిన సందర్భంలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో రైతుల శ్రేయస్సుకై ఇంకా చేపట్టబోయే వివిధ రకాల కార్యచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని సభ్యులందరూ చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, డైరెక్టర్లు అజయ్ పటేల్, సాయిని అశోక్ ,శివకుమార్ సెట్, మన్మత్ పటేల్, శంకర్ నాయక్, నాగనాథ్ పటేల్, గోనే లక్ష్మి, రాజు పటేల్, రాములు ,శ్రీహరి ,మారుతి, మైమద్ గోరి, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



