జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి
కాట్రేనికోన మండలం లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం యూరియ కొరత పై ఆకస్మిక తనికి చేయడం జరిగింది. ఇందులో భాగంగా పల్లంకురు గ్రామంలో రైతులను కలిసి చేపలు మరియు రోయల్ చెరువులో యూరియ వాడకం జరుగుతుంది అని ఆరా తీయడం జరిగింది. రైతులు ఇచ్చిన వాగ్మూలం మేరకు మండలంలో అటువంటి ఎరువులు ఏమి వాడకం లేదు అని తెలిసింది. అనంతరం కాట్రేనికోనలో గల శ్రీ వెంకట సుబ్రమణ్య ట్రేడర్లు నందు ఎరువులు నిల్వ, అమ్మకం, డివిటి మరియు పి ఓ ఎస్ నందు అప్డేషన్ తనికి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా విజిలెన్స్ స్పై ఎస్ తాతారావు డి సి టి ఓ ఎం నవీన్ కుమార్ మండల వ్యవసాయ అధికారి బి. మృదుల గ్రామ మత్స్యశాఖ సహాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులు పాల్గొన్నారు


