జనం న్యూస్, ఆగస్టు26,మునగపాక
వినాయక చవితిని పురస్కరించుకుని యలమంచిలి నియోజకవర్గం మునగపాకలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ ఆధ్వర్యంలో 4000 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను జలకు,పాఠశాలలకు, గ్రామాలకు విస్తృతంగా పంపిణీ చేశారు.పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని సాయికృష్ణ ముందుండి నిర్వహించారు.పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది అని సాయికృష్ణ తెలిపారు.



