పాఠశాల కరస్పాండెంట్ చంద్రకాంత్ గౌడ్,
జనం న్యూస్,ఆగస్ట్ 26,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ప్రతిమలను వితరీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో కాలుష్యం పెచ్చుమీరడంతో కాలుష్య విరహిత సమాజాన్ని నిర్మించాలన్న సదుద్దేశంతో మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే పూజించాలని అన్నారు.ఇప్పటినుంచి కెమికల్ తో కూడిన వినాయక ప్రతిమలు వాడడం వల్ల జల కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు.జల కాలుష్యాన్ని నిర్మూలించడానికై మా పాఠశాల విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలను చూడ ముచ్చటైన మట్టి ప్రతిమలను తయారు చేయడం జరిగిందని అన్నారు.ఇ కాలంలో కాలుష్యాన్ని నివారించడానికి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన పరిచి ప్రోత్సహించడంతో మట్టి గణపతులను వివిధ స్వరూపాలను ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగిందని అన్నారు. మట్టి గణపతి తయారీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముగ్గురికి పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఐసీఐ రీజియన్17 వ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్,తగిన ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం చంద్రకాంత్ గౌడ్,హేమలత,నరేష్, సుధీర్,అనిల్,ప్రశాంత్,రవీందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.


