Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల,

మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీను ఎంపీవో శివచరణ్ స్థానిక పంచాయతీ కార్యదర్శి జాకిర్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ కాలనీ వాసులు ఎంపీవోతో మాట్లాడుతూ.. మురికి కాల్వలు లేకపోడంతో కాలనిలో ఇబ్బందిగా ఉందని, వెంటనే మురికి శుభ్రం చేయించి డ్రైనేజీ లు ఏర్పాటు చేయాలనీ అన్నారు. దీనితో పాటు ఇందిరమ్మ కాలనిలో పిచ్చి మొక్కలు ఎపుగా పెరిగాయాని, దోమల బెడదా ఎక్కువగా ఉందని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు ఎంపీవో తో అన్నారు. కాలనీ లో శుభ్రత చర్యలు చెపడ్తామని ఎంపీవో అన్నారు.