Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 26 జగిత్యాల జిల్లా

బీర్పూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మండపంలో,సారంగాపూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ లో బీర్ పూర్,సారంగాపూర్ మండల మద్దతుదారుల ముఖ్య సమావేశంలో పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల పై దిశా నిర్దేశం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .ఎమ్మెల్యే మాట్లాడుతూ…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పని చేసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేస్తా…
స్థానిక సంస్థలలో పార్టీ నీ గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.అధికార పార్టీకి మద్దతుగా ఉన్నపుడే అభివృద్ధి సాద్యం.రోల్లవాగు పూర్తి కోసం తన వంతుగా కృషి చేస్తున్నానని,రాష్ట్రంలోనే ఉన్నత అధికారిణి పి సి సి ఏప్ గారిని కోరగానే పరిశీలించారు.కేంద్ర మంత్రులను సైతం కలవడం జరిగింది.తుంగురు గ్రామంలో కస్తూర్బా పాఠశాల ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి 14 పల్లె దవాఖాన లు మంజూరు..జగిత్యాల కు 203 కోట్ల తో నూతన ఆసుపత్రి మంజూరు చేయటం జరిగింది ..
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుంది.2 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు కావడం జరిగింది.జగిత్యాల నియోజకవర్గానికి అత్యధికంగా ఈజీఎస్ నిధులు.అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..దశాబ్ద కాలం తర్వాత నూతన రేషన్ కార్డులు మంజూరు తో సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యం.ఉచిత బస్,కరెంట్,సన్న బియ్యం పంపిణీ చేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.సీఎం సహాయ నిధి చెక్కులు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వములో 400 కోట్లు ఖర్చు చేస్తే,నేడు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు.మండలం లో ఇందిరా నగర్,గోండు గూడెం లను నూతన గ్రామ పంచాయతీ లుగా ఏర్పాటు చేయటం జరిగింది,అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయటం జరిగింది.జగిత్యాల చల్గల్ వద్ద 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్ మంజూరు చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి రాజన్న, రాజగోపాల్ రావు, అక్కినపెళ్లి సంపత్,గోనే రమణ రావు,చంద్ర శేఖర్ రావు,ముక్క వెంకటేష్ యాదవ్,మహేందర్ రావు, ఓగుల అజయ్,మండల మాజి ప్రజాప్రతినిధులు, ప్యాక్స్ డైరెక్టర్లు,వార్డు సభ్యులు,సోషల్ మీడియా వారియర్స్,నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..