Listen to this article

జనం న్యూస్.ఆగస్టు26. మెదక్ జిల్లా.నర్సాపూర్.

నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం ప్రధాన చౌరస్తావద్ద రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు,అదే సమయంలో ఎమ్మెల్యే సునితారెడ్డి నర్సాపూర్ మీదుగా గోమారం వెళ్తున్నారు,చౌరస్తా వద్ద నిరసన కారులు ఎమ్మెల్యే సునితారెడ్డి వాహనాన్ని ఆపి యూరియా అందడంలేదని మొరపెట్టుకోగా.వారికి మద్దతుగా ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించి రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు, ప్రధాన రహదారిపై వాహనాలుఎక్కడికక్కడ నిలిచిపోయాయి పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే సునితారెడ్డిని అరెస్టు చేసి స్థానిక పట్టణ స్టేషన్ కు తరలించారు,ఈసందర్బంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ గత మూడు రోజులుగా వివిధ గ్రామాల నుండి రైతులు యూరియా కోసం ఉదయం ఆరు గంటలనుండి తిండీ సాయంత్రం వరకు భోజనాలు చేయకుండా క్యూలైన్ లో వరుసగా నిలబడితే ఒక్క బస్తా యూరియా కూడా రైతులకు అందడం లేదన్నారు,నిరాశ చెందిన రైతులు నశించి నేడు రోడ్లమీదకు రావడం జరిగిందన్నారు,రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు ప్రణాళిక లేనందువల్లే మన రాష్ట్రంలో ఈపరిస్థితి నెలకొందని ఆమె మండిపడ్డారు,ఒక బస్తా యూరియా260రూపాయల సంచిని400రూపాయలకు దళారులను ఆశ్రయించి రైతులు కొనుగోలు చేసి నష్ట పోతున్నారని వాపోయారు,తక్షణమే రైతులకు సరిపడ యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో మున్ముందు రైతులతోకలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో.మండల పార్టీ అధ్యక్షులు భోగశేఖర్,పట్టణ అధ్యక్షులు పంబల్ల బిక్షపతి నాయకులు పడిగే నర్సింలు అండూరి గణేష్ సత్యం గౌడ్ ప్రసాద్ సుధాకర్ రెడ్డి సుదీప్, వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు ఉన్నారు.