Listen to this article

జనం న్యూస్ 28 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

భోగాపురం మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారి 16పై మంగళవారం మధ్యాహ్నం వర్షం నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న కారణంగా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. అందులో ఒక మహిళ తలకు గాయం కాగా, మిగిలిన ముగ్గురుకి స్వల్ప గాయాలయ్యాయి. నలుగురిని అంబులెన్సులో తగరపువలస ఎన్నారై ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.