Listen to this article

మద్నూర్ ఆగస్టు 28 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లో నిన్నటి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మద్నూర్ మండల కేంద్రం లోని జెడ్ పి హెచ్ ఎస్ లో ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయ కేంద్రానికి గురువారం ఉదయం సిర్పూర్ గ్రామ నుండి 15 కుటుంబాల బాధితులను తరలించారు. ఈ సందర్భంగా బాధితుల యోగక్షేమాలు తెలుసుకుని వారికి వరదలు తగ్గే వరకు వారికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.అదే విధంగా ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గత వారంలో వచ్చిన వరదల మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నందున రెవెన్యూ, పోలీస్, అధికారులు తడి హిప్పర గ్రామంలో వరద ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురి కావొద్దు అని మద్నూర్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రము కు తరలిస్తాం రావాలని అన్నారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎం డి ముజీబ్ గారు, ఎంపీడీఓ రాణి, మద్నూర్ ఎస్సై విజయ్ కొండ , కార్యదర్శి సందీప్ తదితరులు పాల్గొన్నారు.