

జనం న్యూస్ ఆగష్టు 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
వర్షాకాలంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో మండల ప్రజలకు సూచించారు.వాహనాలను పరిమిత వేగంతో నడపాలని, గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.విద్యుత్ స్తంభాలు, తీగలను ముట్టరాదని, రైతులు పొలాల్లో ఉన్నప్పుడు ఫోన్లలో మాట్లాడకూడదని హెచ్చరించారు.అలాగే ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు,చెరువుల వద్దకు వెళ్లరాదని,రోడ్డుపై నడిచేటప్పుడు మ్యాన్‌హోల్స్, గుంతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.తల్లిదండ్రులు పిల్లలను రోడ్లపైకి వెళ్లకుండా చూసుకోవాలని తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ కు, అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేస్తే సహాయాన్ని అందిస్తారని పేర్కొన్నారు.