Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు కలుపును నివారించుకునేందుకు మల్చింగ్ పేపర్ ఏర్పాటు చేసుకున్నట్లు అయితే ఎకరానికి 8000/- రూపాయలు చొప్పున సబ్సిడీ అందించడం జరుగుతుందని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు.గురువారం మండలంలోని మొద్దుల చెర్వు వద్ద సాగవుతున్న ఉద్యాన పంటలను సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…
తక్కువ కాలం లో ఎక్కువ ఆదాయాన్ని అందించే ఉద్యాన పంటలను సాగుచేసి రైతులు అధిక ఆదాయం పొందాలని కోరారు.ఆధిక ఆదాయాన్ని ఇచ్చే పండ్లు కూరగాయలు మరియు ఇతర వాణిజ్య, ఉద్యాన పంటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని, వివిద పథకాలకు సంబందించిన 2025-26 వార్షిక ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు.ఆయిల్ పామ్ విస్తరణ పథకం, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మ నీటి పారుదల పథకం, వెదురు మిషన్ పథకాలకు దరఖాస్తు చేసుకునే రైతులు అధికారులకు దరఖాస్తు చేసుకువాలని సూచించారు. కొత్త తోటల పెంపకం కొరకు ప్రభుత్వం పెద్ద మొత్తం లో రాయుతి అందజేస్తుందని చెప్పారు.పాత మామిడి తోటల పునరుద్ధరణ పథకం కింద రైతులకు ఎకరానికి 9600/- రూపాయలు రాయితీ అందించడం జరుగుతుందన్నారు.రైతులు ప్రభుత్వం అందించే రాయుతిలను సద్వినియోగం చేసుకొని ఉద్యాన పంటల సాగు వైపు మొగ్గు చూపాలన్నారు.అనంతరం మాధవరం గ్రామంలో ఉన్న ఆయిల్ పామ్ నర్సరిని సందర్శించారు.మొక్కల పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్త లు,సూచనలు అందజేశారు.ఈ కార్యక్రమం లో ఉద్యాన విస్తరణ అధికారులు రంగు ముత్యం రాజు,యానాల సుధాకర్ రెడ్డి, వంగూరి అనిల్ రైతు వేంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.