Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మునగాల మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 వ తేదీ లోపు గ్రామపంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు.