Listen to this article

జనం న్యూస్,ఆగస్టు28,అచ్యుతాపురం:

వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామంలోని పలు వీధుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామాల్లో మండపాలను పోటాపోటీగా ఏర్పాటు చేసి ఉత్సాహభరితంగా పండుగను జరుపుకున్నారు.గణనాథునికి ఇష్టమైన నైవేద్యాలను తయారుచేసి భక్తులకు పంచిపెట్టారు. ముసలమ్మపాలెం గ్రామంలో వినాయక చవితి పండగ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేసిన భారీ అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.సాయంత్రం చిన్న పిల్లలు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు,కుశ్వంవతనాయుడు, వెంకునాయుడు, నాయుడుబాబు, అర్జున్,అర్జున్ రావు, రాంబాబు,రాజుబాబు, సన్నిబాబు, కొండబాబు, రవణమ్మ,సత్యవతి, వైష్ణవి,ఇస్తాత ,అరుణ, వేణి,అనిల్,మోహన్ రావు,మణి,కుమారి తదితరులు పాల్గొన్నారు.