

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిపనులు పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి.
వర్షాలతో పనులకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం.
29 మంది లబ్ధిదారులకు రూ.21లక్షల విలువైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు అందచేసిన మాజీమంత్రి.
సంక్షేమపథకాల అమల్లో కూటమిప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ప్రజల సంతోషం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికష్టాలున్నా ఇచ్చినమాటకు కట్టుబడి సూపర్-6 పథకాలను పక్కాగా అమలుచేశారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం.ఆర్.ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాటి మాట్లాడారు. గురువారం 29 మంది లబ్ధిదారులకు రూ.21 లక్షల విలువైన చెక్కుల్ని ఆయన స్వయంగా అందచేశారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై దుష్ప్రచారం చేయకుంటే వారికి నిద్రపట్టదు తిన్నది అరగదు పరిపాలన మసుగులో జగన్ ఐదేళ్లలో రాష్ట్ర్రాన్నిఅయినకాడికి దోచేసి ఖజానా ఖాళీ చేశాడని ప్రత్తిపాట చెప్పారు. అధికారంలోకి వచ్చాక, నిధుల సమస్య ఉన్నాకూడా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతోనే చంద్రబాబు ఏడాదిలోనే పథకాలన్నీ అమలుచేశాడన్నారు. ప్రజల దీవెనలు, దేవున అనుగ్రహంతో రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధిచెందితే, చంద్రబాబు మరిన్ని వినూత్న పథకాలు ప్రవేశపెడతారని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజల బాధలు..కష్టాలు తనవిగా భావించే ముఖ్యమంత్రి దొరకడం నిజంగా ప్రజల అదృష్టమన్న ప్రత్తిపాటి… చంద్రబాబు పట్టుదల, సంకల్పంతో ప్రజలకోసం పనిచేయడాన్ని జగన్.. వైసీపీనేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రతిరోజూ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయకుంటే వారికి నిద్రపట్టదని, చివరకు తిన్నతిండి కూడా అరగదని ప్రత్తిపాటి ఎద్దేశాచేశారు.వర్షాలతో పనులకు ఆటంకం కలగకూడదు సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన ప్రత్తిపాటి… నాణ్యతా ప్రమాణాల ప్రకారం చెప్పిన సమయానికి పనులు పూర్తిచేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇటీవల రూ.1.22 కోట్లతో ప్రారంభించిన మాంసం..చేపల విక్రయ దుకాణసముదాయ నిర్మాణ పనులు పరిశీలించిన ప్రత్తిపాటి.… వర్షాల వల్ల పనులకు ఆటంకం లేకుండా చూడాలని, అవసరమైతే అదనపు పనివారిని నియమించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షలు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ కార్యదర్శి మద్దుమల రవి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, నాయకులు తదితరులున్నారు.