Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

చిలకలూరిపేట సుబ్బయ్య తోట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు వినాయక చవితి రెండో రోజు గురువారం పురస్కరించుకొని, ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు శ్రీ దత్త సాయి కి జరిగినాయి అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దత్త సాయికి ప్రత్యేక ప్రదక్షణ అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ వినాయక సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా పట్టణంలోని పలు పందిరిలో ట్రస్ట్ తరఫున ప్రత్యేక ప్రసాదాలు అందజేస్తున్నామని అన్నం పరబ్రహ్మ స్వరూపమని గురువారం అన్నసంతర్పణ చేసిన భక్తులకు అఖండ గురు బలం లభిస్తుందని శ్రీ దత్త అనుగ్రహం లభిస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ కూడా గురువారం జరిగే అన్నసంతర్పణ కార్యక్రమంలో అన్న ప్రసాదం స్వీకరించడం వలన మన కర్మలను నశించి కొన్ని ఆది వ్యాధులు తగ్గుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు అయినవోలు హనుమంతరావు కాంపౌండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొండముట్ల నాగేశ్వరరావు, మద్దుల ప్రసాదు కొంతమంది పుర ప్రముఖులు పాల్గొన్నారు,