Listen to this article

హైదరాబాద్: మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్ పేట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. హఫీజ్ పేట్ రైల్వేస్టేషన్‌ (Hafizpet Railway Station) సమీపంలో శనివారం అర్ధరాత్రి కొంతమంది ముఠా సభ్యులు ఓ గుర్తుతెలియని వ్యక్తిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అనంతరం బాధితుడి తలపై సిమెంట్ ఇటుకలతో పలుమార్లు మోది కిరాతకంగా హతమార్చారు.