Listen to this article

జనం న్యూస్ 27 ఆగస్టు కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి )

శేషగిరి నగర్ పంచాయతీ గ్రామంలో ఆకాశం విరిచిన వర్షాల కారణంగా పెద్ద నష్టం సంభవించింది. కాకెల్లి ఝూన్సీ గారి ఇంటి వెనుక ప్రహారీ గోడ కూలిపోవడంతో ఆ కుటుంబానికి సుమారు రూ.50,000 విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. రోజూ కూలి పనులు చేసి జీవనోపాధి నెట్టుకొస్తున్న ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వారు ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు. ఘటన స్థలానికి గ్రామ సెక్రటరీ వెళ్లి పరిశీలించి, నష్టానికి సంబంధించిన ఫొటోలు తీసి పై అధికారులకు నివేదించారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
స్థానికులు కూడా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించాలని, వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నారు.