

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 28
లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మౌలాలి భారత ప్రభుత్వం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి గౌరవ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆగస్టు 2 నుండి 15 వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రచారానికి స్వచ్ఛందం గా పాల్గొని, భారత జాతీయ జెండాను గౌరవం గా ఎగురవేయడానికి, ఐక్యతా స్ఫూర్తిని నింపడానికి, ప్రతి ఇంటిలో తిరంగాను ఎగురవేయమని ప్రోత్సహించడం,నియమావళి ప్రకారం జాతీయ జెండాను ఎగురవేయడంలో విద్యార్థులకు,ప్రజలకు అవగాహన కల్పించడం, జాతీయ జెండాలను ఉచితముగా పంపిణీచేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేసినందుకు గుర్తింపుగా భారత ప్రభుత్వం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి సర్టిఫికెట్ ఆఫ్ హానర్ అధికారిక ధృవీకరణ పత్రాన్ని పోర్టల్ ద్వారా అందుకున్నట్లు ఉపాధ్యాయుడు మౌలాలి తెలిపారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో స్వచ్చందంగా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయుడు మౌలాలి తెలిపారు