

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు, తేదీ 29.8.25: ఆధునిక తెలుగు భాషా వైతాళికుల్లో ఒకరైన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ డాక్టర్ బచ్చు జయ భాస్కర రావు అధ్యక్షతన స్థానిక బచ్చు భవన్ నందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఉపాధ్యాయుడిగా చరిత్ర పరిశోధకుడిగా విద్యావేత్తగా ఆయన తెలుగు భాషకు ఎన్నో సేవలు అందించిన సందర్భంగా ఆయన జయంతి పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపు కుంటున్నాం అని డాక్టర్ జయ భాస్కర్ రావు తెలిపారు.ఎస్.ఐ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ మన్యం ( ఏజెన్సీ) ప్రాంతంలో ఉపాధ్యాయుడుగా పనిచేసేటప్పుడే గిరిజన తెగల వారైనసవరలను విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సవర భాష నేర్చుకుని అందుకు లిపిని కూడా ఏర్పరిచి వారికోసం బోధించే బడులను కూడా పెట్టడం జరిగింది.తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడటానికి మరియు భాషను భావయుక్తంగా వాడుకలోనికి తీసుకురావ డానికి తీవ్ర కృషి చేశారని శ్రీ గిడుగు వెంకట రామమూర్తి 1848 ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్‌లోని గిద్దలూరులో జన్మించారు. ఆయన ఒక గొప్ప రచయిత మరియు పండితుడు, మరియు ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గ దర్శకులలో ఒకరిగా పరిగణించబడతారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లయన్ కుర్రా మణి యాదవ్, కొత్తపల్లి రాజాచారి, గంధం గంగాధర్, మోడపోతుల రాము మరియు తీగలకుంట వెంకటేష్ పాల్గొని నివాళులర్పించడం జరిగింది.