Listen to this article

జనం న్యూస్.ఆగస్టు28. సంగారెడ్డి జిల్లా. హత్నూర.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పర్వీన్ షేక్ తెలిపారు.గురువారం ఆమె తన సిబ్బందితో కలిసి హత్నూర మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువు కుంటలను సందర్శించారు అలాగే దౌల్తాబాద్ గ్రామంలో వర్షానికి కూలిన ఇండ్లు శిథిలావస్థలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరగతి గది వర్షానికి తడిసి ఒకవైపు కూలిన గోడను పరిశీలించారు. కూలిన ఇండ్ల బాధితులకు తగిన న్యాయం జరిగేలా పై అధికారులకు నివేదిక పంపించడం జరుగుతుందని తెలియజేశారు మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.డ్రైనేజ్ మోరీలు మ్యాన్ హోల్ గుంతలు విద్యుత్ తీగలు కరెంటు స్తంభాలతో దూరంగా ఉంటూ జాగ్రత్త వహించాలని కోరారు.చిన్నపిల్లలు చెరువుకుంటల వద్దకు వెళ్లకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదనితెలిపారు.వర్షాల కారణంగా గ్రామాలలో చెరువులు కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయని నీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని ప్రజలకు సూచించారు ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే పోలీసులకు తాసిల్దార్ కార్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు.తాసిల్దార్ వెంట హత్నూర ఎంపీడీవో శంకర్ డిప్యూటీ తాసిల్దార్ దావూద్ అహ్మద్ ఎస్సై శ్రీధర్ రెడ్డి రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు