

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ గంగా పార్వతీ నాగేశ్వర స్వామి వారిని బిజెపి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్ మరియు తిరుపతి ఇంచార్జ్ నాగముని విచ్చేశి దర్శించుకున్నారు. నూతన చైర్మన్ గా ఎంపికైన తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి స్వాగతం పలికి మర్యాద పూర్వకంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ, జిల్లా కార్యదర్శులు బెజవాడ విజయమ్మ కృష్ణమూర్తి, పట్టణ మాజీ అధ్యక్షులు నూతలపాటి శ్రీనివాసులు, ట్రెజరర్ దుర్గి రమేష్, జిల్లా ఓబీసీ కార్యదర్శి పిచ్చుక సూరిబాబు, రూరల్ మండలం కార్యదర్శి గంగూరు వాసు గౌడ్, తడ మండల అధ్యక్షుడు తేజ రెడ్డి, అర్బన్ కమిటీ సెక్రటరీ శరవణ ,సాయి, పాల్గొన్నారు