

జనం న్యూస్. తేదీ 30-8-2025.
మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం సామాజిక బాధ్యతతో
పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ ప్రతి ఒక్కరం ఒక మొక్క నాటుదాం
పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొని గ్రామస్తులు మరియు విద్యార్థిని విద్యార్థులతో కలిసి మొక్క నాటి పర్యావరణ గురించి ఉద్దేశించి మాట్లాడిన డిఎస్పి సతీష్ కుమార్ గారు ప్రతి ఒక్క వృక్షమై మనకు ప్రాణవాయువు అందిసాయి. ఆరోగ్యంగా సరిపడా ఫలాలను అందిస్తాయి ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆనాటి పూర్వికులు నాటిన మొక్కలు వృక్షాలుగా మారి స్వచ్ఛమైన సహస సిద్ధమైన వాతావరణం జీవరాశికి ఉపయోగకరమైన విధంగా ఉంటున్నాయి ఈరోజు మనం నాటిన మొక్కలే రేపటి భావి తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ తో పాటు ఫలాలని ఆరోగ్యని అందిస్తాయని పర్యావరణ పరిరక్షణ సహజ పర్యావరణాన్ని రక్షించడానికి కాలుష్యం నిషేధించడానికి పర్యావరణ సమతుల్యత కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసి రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ, అరేం ప్రశాంత్, తాటి శేషు, కొండ్రు శ్రీరాములు, కోరేం రమేష్, సోయం హరికృష్ణ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొర్స బాబురావు, శ్రీదేవి, సోడే మధు, వంశీ, సందీప్, సంపత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
