

జనం న్యూస్ 31 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి
ఉద్యోగ విరమణ అనివార్యమని, శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని రుద్రూర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ అధిపతి డాక్టర్ సమతా పరమేశ్వరి అన్నారు. శనివారం నాడు పరిశోధన స్థానం ఉద్యోగులు జమీలబి, తేజమ్మ పదవి విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు శాలువా పూల బొకేతో ఘనంగా సత్కరించి వారి సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారులు రాకేష్, శంకర్, శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి షేక్ ఈసా,హబీబ్, అక్బర్ హుస్సేన్, ఖదీర్, శేఖర్ శేఖర్, సాయిలు, రమేష్, కళావతి, రత్నమ్మ, లలిత, సుమలత వ్యవసాయ పాలిటెక్నిక్ క్ విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.