

జనం న్యూస్,ఆగస్టు 30,అచ్యుతాపురం:
అమెరికా విధించిన అదనపు టారిఫ్ భారం ప్రభుత్వమే భరించి పరిశ్రమల మనుగడ, కార్మికుల ఉపాధికి ఇబ్బందుల్లేకుండా చూడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపే అమెరికా టారిఫ్ పెంపు నిర్ణయాల్ని వెనక్కు తీసుకొనేలా మోడీ ప్రభుత్వం ఒత్తిడి చేయకపోవడం విచారకరమని,టారిఫ్ పెంపుతో 22వేల మందికి ఉపాధి కల్పిస్తున్న బ్రాండిక్స్ వస్త్ర పరిశ్రమ దెబ్బతినే ప్రమాదముందని, ఉత్పత్తి తగ్గించినా,నిలిపివేసినా మహిళల ఉపాధి పోతుందని టారిఫ్ భారంతో పరిశ్రమలు దెబ్బతినకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్ధిక తోడ్పాటు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోము నాయుడు తదితరులు పాల్గొన్నారు.