Listen to this article

జనం న్యూస్ 30 ఆగష్టు పెగడపల్లి.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల మండల స్థాయి అధ్యక్షులు కార్యదర్శిలు నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల కు సంబంధించి ఓటర్ల జాబితా మరియు పోలింగ్ స్టేషన్ల కు సంబంధించిన అభ్యంతరంలపైన సమావేశాన్ని నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎఎంసి చైర్మన్ బుర్ర రాములు గౌడ్, బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు లోకమల్లారెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, బీఎస్పీ మండల అధ్యక్షుడు శంకర్ మరియు స్థానిక నాయకులు సిహెచ్ విజయభాస్కర్ గంగుల కొమురెల్లి తోడేటి గట్టయ్య కాసెట్టి వీరేశం మడిగల తిరుపతి తదితరులు హాజరైనారు.