Listen to this article


▪యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్..జనం న్యూస్ //జనవరి //28//జమ్మికుంట //కుమార్ యాదవ్..
జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మాజీ దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి ఈ దేశానికి సేవలందించిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ని ఉగ్రవాది తో పోల్చడంపై బండి సంజయ్ వాఖ్యలను జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిచారు . కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం నీతిమాలిన చర్య అని యూత్ కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నాం, అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో, ఇందిరమ్మ ఫోటో ఉంటే మీకు ఇల్లు ఇవ్వము అని చెప్పడం ఒక దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం, అని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు పథకంలో 100 లో 85 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయితే, మీ బిజెపి ప్రభుత్వం 15 శాతం వాటా ఇస్తే మీ ప్రభుత్వం నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. అలాగే ప్రజా యుద్ధనౌక గద్దర్ పైన నక్సలైటు హంతకుడు బిజెపి భావాజాలం లేని వ్యక్తికి మేము ఎలా అవార్డులు ఇస్తామని మీడియా వేదికగా అనడం జరిగిందన్నారు.మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివినప్పటికీ విదేశాలలో ఉద్యోగం చేస్తూ బంగారు జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ, పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం తన గళంతో ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య భూమిక పోషించారన్నారు.అలాంటి వాగేయకారుడైన గద్దర్ ని మీరు అవహేళన చేయడం ఏమాత్రం సరికాదని మీరిచ్చే అవార్డులు రివార్డులు గద్దర్, లాంటి గొప్ప వ్యక్తికి అవసరం లేదని! వారు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల హృదయాలలో ఉన్నాడని కొనియాడారు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలని బండి సంజయ్ కి సూచన ఇవ్వడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న నీవు రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఆదరణను ఓర్వలేక అవాకులు – చేవాకులు మాట్లాడుతున్నావని, నీ అర్థం పర్థం లేని మాటలతో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నావన్నారు , ఇలాగే కొనసాగితే ఖబర్దార్ బండి సంజయ్ నిన్ను రాబోయే రోజులలో రోడ్ల మీద తిరగనియ్యమని, ఎక్కడికక్కడ సంజయ్ ని అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ తరపున హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్, తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశాంత్, సంపత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అభిలాష్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శులు అజయ్, వెంకటేష్, నాయకులు గణేష్, జావిద్, రాజ్ కుమార్, అష్రఫ్, శివ, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.