Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 30 నడిగూడెం

మండలం లోని రత్నవరం గ్రామం లోని గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర శ్రీ శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా దాతలు మాట్లాడుతూ..మహా అన్నదానం ఏర్పాటు చేసి పది మందికి ఆకలి తీర్చడంతో ఎంతో సంతృప్తి కలిగిందని అన్నారు.విగ్రహ నిర్వాహకులు పదిమంది ఆకలి తీర్చడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో దాతలు గోగుల వెంకటేశ్వర్లు జానకమ్మ, బాణాల మనోజ్ కృష్ణ వేణి,వరికిప్పల విష్ణు వైష్ణవి దంపతులు కమిటీ సభ్యులు కుంచం వాసు, కుంచం ఉపేందర్, గోగుల రాంబాబు,గోగుల లింగయ్య, గోగుల వీరబాబు, కుంచంమహేష్,కుంచం నాగేంద్ర బాబు,వరికిప్పల వెంకటేష్,కుంచం సతీష్,పల్లపు సంతోష్, గోగుల నవీన్, గోగుల గోపి, వరికుప్పల అనిల్ ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.