Listen to this article

జనం న్యూస్ జులై 30 మండలం పెన్ పహాడ్ : పేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం అని ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు ఆధ్వర్యంలో శనివారం లింగాల,దూపాడు, న్యూ బంజారా హిల్స్ తండా, జల్మల కుంట తండా లో ఇందిరమ్మ ఇండ్లు కు శంకుస్థాపన చేసి, నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. వాళ్లు మాట్లాడుతూ: గత పది సంవత్సరాల నుండి ఇవ్వనీ ఇండ్లు, రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం తోని సాధ్యమైందని రైతు రుణమాఫీ ఉచిత బస్సు ప్రయాణం రైతు భరోసా సన్న బియ్యం ఉచిత విద్యుత్ అర్హత ఉన్న నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం 3500 ఇండ్లను నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతుందని ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని రేషన్ కార్డు నిరంతరం ప్రక్రియని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం పేరు చెప్పి దోపిడీ చేశారని తోయబట్టారు . లింగాల నుండి నేడింజర్లగా వెళ్లే దారి డబల్ రోడ్డు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అలీ, జిల్లా యువజన అధ్యక్షులు అభినయ్ మార్కెట్ డైరెక్టర్ లు, ఆర్తి కేశవులు, దామోదర్ రెడ్డి, మండల యువజన అధ్యక్షులు శివా నాయక్ గ్రామ శాఖ నారాయణ ప్రవీణ్ రెడ్డి,గజ్జల సైదిరెడ్డి , గాంధీ కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు