Listen to this article

జనం న్యూస్ 31 ఆగస్టు వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో నిజాంపేట్ మేడిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతినెల 30 తేదీనాడు మండల పరిధిలో ఏదో ఒక గ్రామాన్ని సెలక్షన్ చేసి కుల విచక్షణ అనే అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా హాస్టల్ వార్డెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి గ్రామ సెక్రెటరీ ఆధ్వర్యంలో గ్రామంలో . పాఠశాల హెచ్ఎం ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్స్ ఇలా గ్రామ నాయకులతో కలిసి కుల విచక్షణ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా హాస్టల్ వార్డెన్ మాట్లాడుతూ మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కులాల పేరుతో అంటరానితనంతో ప్రజలను చాలా బాధించడం జరిగింది కాబట్టి ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఈ కుల విచక్షణ కుల విచక్షణ ఉండొద్దని భారత దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటేనని చెప్పాడు అదేవిధంగా ఆయన ప్రాథమిక హక్కులు ప్రజలందరికీ కల్పించాడు ప్రతి పౌరునికి ఈ సమాజంలో సమానమైన హక్కు ఉంటుందని ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే విధంగా రాజ్యాంగంలో అప్పుడే పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో కొన్ని పట్టణాలలో ఈ కుల విచక్షణ అనేది లేకుండా అందరూ సమానంగా ఉంటున్నారు. కానీ చాలా గ్రామీణ ప్రాంతాలలో ఈ అంటరానితనము రెండు గ్లాసుల పద్ధతి గ్రామాలలో కటింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఎస్సీలు మీరు ఎస్టీలు అంటరాని కులానికి చెందినవారు అని చాలా చులకన మాట్లాడుతున్నారు.  ఇలాంటి అన్ని లేకుండా అందరము సమానంగా ఉండాలని ఉద్దేశంతోనే మన ప్రభుత్వం ప్రతి నెల 30 తారీఖు ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో అందరికీ అవగాహన రావాలని ఈ కులావిచక్షణ అనే అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకో�