Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం వర్షం కాలం సీజన్ కు గాను ఇప్పటివరకు పి ఎ సి ఎస్ , ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాల ద్వారా, ఓ డి సి ఎం ఎస్ ల ప్రైవేటు డీలర్ల వద్ద 1235 టన్నుల యూరియా ఉంది అని శాయంపేట వ్యవసాయ అధికారి గంగా జమున అన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇదే కాకుండా 750 లీటర్ల నానో యూరియా కూడా రైతులకు అందించారు 473 లీటర్ల నానో యూరియా మండలంలో గల వివిధ షాపులలో అందుబాటులో ఉన్నాయి
ప్రగతి సింగారంలో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 20 టన్నుల యూరియా, ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం శాయంపేటకు 20 టన్నుల యూరియా, సాయి ఫెర్టిలైజర్స్ నుండి 15 టన్నుల యూరియా గట్ల కనపర్తి లో గల శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపుకు 5 టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంది కావున మండలంలో గల రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందవద్దు అని తెలిపారు యూరియా పంపిణీ అవగానే మళ్ళీ యూరియా తెప్పించడానికి అందుబాటులో ఉంటామని అన్నారు పత్తిలో వేయబోయే రెండవ దఫా లేదా మూడవ దఫా నానో యూరియా వాడవల్సిందిగా తెలిపారు . నానో యూరియా వల్ల లాభాలు అనేకసార్లు వివరించడం జరిగింది తీసివేసుకొని నానో యూరియాని వాడవలసింది అని తెలియజేశారు…