Listen to this article

జనం న్యూస్ 31 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా

జనసేన సేవాదళ్, విజయనగరం జిల్లా చిరంజీవి యువత, ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన శనివారం ఉదయం మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) 42వ డివిజన్, కామాక్షినగర్, అయ్యన్న పేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో నిర్వహించారు.
ఈసందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన సంఘసేవకులు, శ్రీ సాయికృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ఉపముఖ్య మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అభిమానులు సేవ అనేదృక్పధంతో పర్యావరణ పరిరక్షణతో పవన్ కళ్యాణ్ ఆశయాలతో ముందుకెళ్తడం అభినందనీయమని జిల్లా చిరంజీవి యువత, జనసేన సేవాదళ్ చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన సేవాదళ్ మరియు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.